గురుకులాల్లో 2026-2027 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ఆహ్వానం-కొండమల్లేపల్లి గురుకుల ప్రిన్సిపాల్ శౌరిల్ల.

తేది :10-01-2026 నల్గొండ జిల్లా TSLAWNEWS దేవరకొండ నియోజకవర్గం పులిజాల గోవర్ధన్

నల్గొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సాంఘిక, గిరిజన, వెనుకబడిన, తరగతుల బీసీ జనరల్ గురుకుల విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ దరఖాస్తు తేదీ జనవరి 21-2026 చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో శనివారం నాడు కొండమల్లేపల్లి సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శౌరిల్ల గురుకులాలలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తెలిపిన వివరాల ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారిని విద్యా రాణి ఆదేశాల మేరకు కొండమల్లేపల్లి మండల పరిధి ప్రాంతాలలో విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక సువర్ణ అవకాశము కల్పించిదన్నారు. 5 వ తరగతిలో ప్రవేశం తో పాటు 6 నుండి 9 వ తరగతిలో మిగిలి ఉన్న ఖాళీల భర్తీకి ప్రభుత్వము నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. కేవలము చదువు మాత్రమే కాకుండా విద్యార్థుల్లోని నైపుణ్యతను పెంచేందుకు ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఇంగ్లీష్ మీడియం బోధన ఉచిత వసతి పౌష్టిక ఆహారము అందించడము ఈ సంస్థల ప్రత్యేకత అని పేర్కొన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇదొక గొప్ప సువర్ణ అవకాశం అని తెలిపారు. దరఖాస్తు చివరి తేదీ జనవరి 21-2026 పరీక్ష తేదీ ఫిబ్రవరి 22- 2026 (ఉదయం 11 నుండి 1 వరకు) కొనసాగుతుందని తెలిపారు. గురుకుల దరఖాస్తుల ప్రభుత్వము వెబ్సైట్ అధికారిక పోర్టల్ https%ngcet.cgg.gov.in ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఒక ఫోన్ నెంబర్ పై ఒకే దరఖాస్తు కు మాత్రమే అనుమతి ఉంటుంది కాబట్టి వివరాలు నమోదు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలన్నారు. గడువు సమీపిస్తున్న తరుణంలో వెబ్ సైట్స్ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కాబట్టి చివరి నిమిషం వరకు వేచి చూడకుండా అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే ఆన్లైన్ దరఖాస్తులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *