చిన్న పిల్లలకు విషంగా మారిన దగ్గు మందు-ఆల్మాంట్ కిడ్ సిరప్‌పై తెలంగాణ ప్రభుత్వం నిషేధం.

తేది:10-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: చిన్న పిల్లల కోసం వినియోగించే దగ్గు టానిక్ ఆల్మంట్ కిడ్ సిరప్ వినియోగాన్ని నిలిపివేయాలని తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి ( డీసీఏ) ఆదేశించింది. ఈ సిరప్‌లో ఇథలీన్ గ్లైకాల్ ప్రమాదకరంగా ఉన్నట్లుగా గుర్తించిన నేపథ్యంలో ఈ హెచ్చరికలు చేసింది.
చిన్నారులకు వినియోగించే దగ్గుమందులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. చిన్నారుల ప్రాణాలు నిలబెట్టాల్సింది పోయి ప్రాణాలను హరించేస్తోంది. గతేడాది మధ్యప్రదేశ్‌లో కోల్డ్ రిఫ్ దగ్గుమందు తాగి 20కి పైగా పిల్లలు చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ దగ్గు మందు తయారీ కంపెనీపై కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంది.తాజాగా తెలంగాణలోనూ పిల్లల దగ్గుమందుపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అల్మాంట్ కిడ్ సిరప్ (Almont-Kid Syrup)ను వాడొద్దని హెచ్చరించింది.
ఆల్మాంట్ కిడ్ సిరప్‌పై నిషేధం
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేశారు. ఆల్మాంట్ కిడ్ సిరప్‌పై నిషేధం విధించింది. ఈ మేరకు ఔషధ నియంత్రణ పరిపాలన డెరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసిం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆల్మాంట్ కిడ్ సిరప్‌ వినియోగించడం ఆపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సిరప్‌లో ఈ దగ్గుమందులో ఎథిలీన్ గ్లైకాల్ కలిసినట్లు ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది.దీంతో సిరప్ వినియోగాన్ని వెంటనే నిలిపివేయాల్సిందిగా తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *