
తేది:10-1-2026 ఖమ్మం జిల్లా.TSLAWANEWS వేంసూరు మండలం రిపోర్టర్ మహమ్మద్. బురహానుద్దీన్.
ఖమ్మం జిల్లా:మండల కేంద్రమైన వేంసూరు లోని తాసిల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి ఎక్సెస్ శాఖ, ఇరిగేషన్ శాఖ, గృహ నిర్మాణ శాఖ, అగ్నిమాపక శాఖ వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తరచు గా ప్రజావాణి కార్యక్రమానికి డుమ్మా కొడుతూ ఉన్నప్పటికీ వివిధ ప్రాంతాల నుండి వచ్చే
ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ప్రజలు వస్తున్నప్పటికీ
తామేదురుకుంటున్న సమస్యలు అధికారులను ప్రజావాణి కార్యక్రమంలో నిలదీసేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ తమ సమస్యలు తీర్చే అధికారులు ఇలా గైర్హాజరవుతుండటం, శోచనీయమని తమ సమస్యలు తీర్చే నాధుడు లేక
తాము దూర ప్రాంతాల నుండి వస్తున్నామని గ్రామాల నుండి వచ్చిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
26 గ్రామపంచాయతీలలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, అదేవిధంగా పార్శుధ్య కార్యక్రమాలు నడుస్తున్నాయని, ఉదాహరణకు గ్రామపంచాయతీలలో రహదారుల వెంట మురికినీరు వ్యర్ధ నీరు వృధాగా పోతున్నప్పటికీ ఆయా గ్రామపంచాయతీలలో సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.మురికి నీరు రహదారుల వెంట ప్రవహిస్తున్నప్పటికీ పంచాయతీ వారు గానీ ఆయా గ్రామాల సర్పంచులు గాని
బ్లీచింగ్ చల్లిన పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది లావణ్య గ్రామపంచాయతీలలో సమస్యలను ఎక్కడ వేసిన గొంగళి అన్న చందంగా ఉన్నాయని, తరచుగాక హాజరవుతున్న సంబంధిత శాఖ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి రెండు మూడు శాఖల అధికారులు హాజరవుతుండటం గమనార్హం. రహదారుల వెంట కొన్ని గ్రామపంచాయతీలలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు పారవేయడం, చెత్తాచెదారం, ఇందిరమ్మ బిల్లులు రాలేదని, అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ గృహాలు గురించి గృ హ నిర్మాణ శాఖ వారు పట్టించుకోవడంలేదని నూతనంగా ఎన్నిక కాబడిన గ్రామ సర్పంచ్. లైన ఈ విషయంలో చొరవ తీసుకోవాలని మండలప్రజలు జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు.
పారిశుధ్యం లోపించి నట్లయితే ఆయాగ్రామ పంచాయతీలలో విష జ్వరాలు ప్రబలే అవకాశాలు మెండుగా ఉన్నాయని దళిత సంఘాల నాయకులు, ఎస్సీల కాలనీల వాసులు, పలువురు వ్యాఖ్యానించారు.