ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.

తేది:9-1-2026, జనగామ జిల్లా, TSLAWNEWS, పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker.

జనగామ జిల్లా :సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, జాతీయ పెన్షన్ పథకం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమికోపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలని, జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, పాఠశాలల విలీనం, మూసివేతను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ (AIJACTO) ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పిసి) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాలకుర్తిలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలోనల్ల బ్యాడ్జ్ లు ధరించి ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ జనగామ జిల్లా అధ్యక్షులు ఎండి షరీఫ్ మాట్లాడుతూ పై డిమాండ్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను మంజూరు చేసి పిఆర్సి నివేదికను తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని ,పదవి విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయుల బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలని, ఉద్యోగుల హెల్త్ కార్డులను మంజూరి చేయాలని, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాల మూసివేత ప్రక్రియనుఆపాలని, ప్రాథమిక పాఠశాల స్థాయిలో ప్రతి తరగతికి ఒక గది, ఒక ఉపాధ్యాయుడు ఉండేలాగా విద్యాహక్కు చట్టాన్ని సవరణ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిదురాల శ్రీనివాస్, దేవగిరి సూర్యప్రకాష్ మరియు టిపిటిఎఫ్ ప్రధాన కార్యదర్శి పి వెంకట నరసయ్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి శోభారాణి, ఓరుగంటి రమేష్, గుగులోతు బలరాం, కేసోమయ్య,రామకృష్ణ ,నరసింహమూర్తి, మరియా జతుర్త ,శోభారాణి, జయశ్రీ ,సుమత , మెహరున్నిసాబేగం, స్వామి ,ఎం శ్రీనివాస్ ,ఎన్ శ్రీనివాస్ , రాజశేఖర్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *