తేది:09-1-2026, జనగామ జిల్లా TSLAWNEWS, పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker.
జనగామ జిల్లా:పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రగతి విద్యానిలయంలో సంక్రాంతి ముందస్తు సంబరాలను నిర్వహించారు. పాఠశాలలో కరస్పాండెంటు వీరమనేని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో భాగంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు .ఈ పోటీల్లో విద్యార్థులు పాల్గొని వివిధ రకాలముగ్గులువేసిఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన రంగవల్లులను పరిశీలించి ఉత్తమ ముగ్గులను ఎంపిక చేసి వారికి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.