రోడ్డు భద్రత మనందరి బాధ్యత -జనగామ జిల్లా ఆర్టీవో శ్రీనివాస్ గౌడ్.

తేది:09-1-26, జనగామ జిల్లా TSLAWNEWS, పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker.

జనగామ జిల్లా :రోడ్డు భద్రత మాసోత్సవలలో భాగంగా శుక్రవారం రోజు పాలకుర్తి లో జనగామ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు, ప్రజలు, డ్రైవర్లు తదితరులచేత భారీ ర్యాలీ మరియు చౌరస్తా లో ఘనంగా మానవహారం నిర్వహించారు. ఈ సందర్బంగా జనగామ ఆర్ టీ ఓ అధికారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ క్యాన్సర్ రోగం తో కంటే ఘోరంగా రోడ్డు ఆక్సిడెంట్ లలో చాలా మంది చనిపోవడం, ఆసుపత్రుల పాలవడం జరుగుతుందని దీనికి ముఖ్య కారణాలుగా మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం, మైనర్ లు వాహనాలు తోలడం, రావణకు, రోడ్డు భద్రతకు సంబంధించిన నియమ నిబంధనలు పాటించకపోవడం, లైసెన్స్ లు లేకుండా, ఇన్సూరెన్స్ లు లేకుండా డ్రైవింగ్ చేయడం లాంటివి ముఖ్య కారణాలు అని విద్యార్థులు తమ తల్లి తండ్రులకు పైవిషయాలను తెలియచేసి నియమ నిబంధనలు పాటింపచేయాలనీ కోరారు. స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ జానకి రామిరెడ్డి గారు మాట్లాడుతూ నిబంధనలు పాటించనివారి పై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని, అనుమతి లేకుండా రోడ్లపై ధాన్యాలు పోయడం, ఫ్లెక్సీలు పెట్టడం లాంటి విషయంలో ప్రజలు చైతన్యం కావాలని కోరారు..
విద్యార్థులా స్లొగన్స్, ప్లా కార్డ్స్ అందరని బాగా ఆకర్షించాయి
ఈ కార్యక్రమం లో ఆర్ టీ ఏ సభ్యుడు అభి గౌడ్ ఎం వి ఐ మహేష్, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మరియు సుధా టెక్నో స్కూల్ కరెస్పాండంట్ రాపాక విజయ్, సిద్ధార్థ, ప్రగతి, కార్మెల్ పాఠశాలల కరస్పాండెంట్ లు, ఎం ఈ ఓ పోతుగంటి నర్సయ్య, పాలకుర్తి నూతన సర్పంచ్ కమ్మగాని విజయ,ఎస్ ఐ పవన్ కుమార్, ఉప సర్పంచ్ గాదెపాక కిరణ్, వివిధ పాఠశాలల బస్సు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *