తేది:9-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.
మెదక్ జిల్లా :మెదక్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో బాగంగా శుక్రవారం ఆలయంలోని విగ్రహాలకు పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి తీర్చిదిద్దారు. పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన భక్తులు అధికసంఖ్యలో ఉత్సవాలకు హాజరవుతూ భక్తి శ్రద్ధలతో పూజలతోపాటు పల్లకి సేవ నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో బాగంగా ప్రతీ రోజు ఉదయం వేళలో వేద పండితులు తిరుప్పావై ప్రవచ నాలు భక్తుల ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్నాయి.