మహాత్మా గాంధీ జాతియ, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలి-జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి.

తేది:09-01-2026 TSLAWNEWS నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ గోరకంటి లింగన్న.

నిజాంబాద్ జిల్లా: నిజాంబాద్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు అధ్యక్షుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును పునరుద్ధరించుటకై ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి మాట్లాడుతూ 2004లో సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు , యూపీఏ చైర్ పర్సన్ గా సోనియాగాంధీ గారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ ప్రాంతం మెదక్ జిల్లాలో,ఆంధ్రా ప్రాంతం అనంతపూర్ లో పర్యటించినప్పుడు కొన్ని గ్రామాలలో ఇండ్లకు తాళాలు ఉండడం చూసి ఎందుకు అని తెలుసుకున్నప్పుడు అక్కడ ఉండే వారు ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం జరిగిందని, దీనిని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం వలసలను నివారించడానికి గ్రామాలలో ఉపాధి కల్పించడానికి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని, దానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పేరు పెట్టడం జరిగిందని,ఆ పతకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల ఉపాధి కల్పిస్తూనే ఏ పని చేయాలనేది, 365 రోజుల్లో ఏ రోజు పని చేయాలనేది దానిని కూడా గ్రామస్థాయిలో సర్పంచులు గ్రామ ప్రజలు కలిసి గ్రామ సభలు ఏర్పాటు చేసుకుని నిర్ణయించుకునే వెసులుబాటును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. కానీ ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం ఆ పథకాన్ని పేరు మారుస్తూనే దానిని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని, వాస్తవానికి బిజెపి ప్రభుత్వం చేసిన 125 రోజుల పనిలో 75 రోజులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుందని, మిగతా 50 రోజులు పని భారాన్ని రాష్ట్రాలపై మోపారని నగేష్ రెడ్డి గారు అన్నారు. మహాత్మా గాంధీ గారి పేరును తీసివేసి జి రామ్ జి అని పేరు పెట్టి పథకాన్ని నీరు గార్చే విధంగా బిజెపి చేసిందని ఆయన మండిపడ్డారు
ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ,మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *