తేది:09-01-2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా అందోలు నియోజకవర్గం కో-ఆర్డినేటర్ సిహెచ్ సత్యనారాయణ.
సంగారెడ్డి జిల్లా: అందోలు నియోజకవర్గ కేంద్రమైన జోగిపేట పట్టణంలో ఉర్దూ కవి, కమ్యూనిస్టు యోధుడు అందోలు గడ్డపై పురుడు పోసుకున్న మగ్దూమ్ మోహియుద్దీన్ పేరున కొందరు జర్నలిస్టులు ప్రెస్ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నారు. నియోజకవర్గంలో పనిచేస్తున్న జర్నలిస్టులు, గ్రామీణ ప్రాంత విలేకరులు కలిసి ఈ అసోసియేషన్ కార్యాలయాన్ని శుక్రవారం పూజా కార్యక్రమాలు నిర్వహించి, స్వర్గీయ మగ్దూమ్ మోహియుద్దీన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కార్యాలయం ప్రారంభించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రజా హక్కుల కోసం కమ్యూనిస్టు నాయకుడిగా పోరాడిన మహా వ్యక్తి, ఉర్దూ కవి మగ్దూమ్ మోహియుద్దీన్ అని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సమాజం కోసం, ప్రజలకు ఉపయోగపడే వార్తలను రాయాలని జర్నలిస్టులకు సూచించారు. ఆ మహనీయుడి పేరును ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని యూనియన్ నాయకులు, సభ్యులను వారు అభినందించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, సిపిఎం పార్టీల నాయకులు, గ్రామ ప్రముఖులతో పాటు పలు జర్నలిస్టు సంఘాల నాయకులు, పాత్రికేయులు పాల్గొన్నారు.