మర్లపాడు లో పెట్రోల్ బంకు వద్ద కారు యాక్సిడెంట్ లో వేంసూరు వాసి నాగరాజుకు తీవ్ర గాయాలు, కోమల్ లోకి వెళ్లిన నాగరాజును ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

తేది:9 -01 -2026 ఖమ్మం జిల్లా TSLAWANEWS వేంసూర్ మండలం రిపోర్టర్ మహమ్మద్ బురహానుద్దీన్.

ఖమ్మం జిల్లా: వేంసూరు మండల పరిధిలోని మర్లపాడులో పెట్రోల్ బంక్ ఎదురుగా కారు యాక్సిడెంట్ లో వెంసూరు గ్రామానికి చెందిన కొమనేపల్లి నాగరాజు నడుస్తూ వెళ్తుండగా సత్తుపల్లి ఎస్ ఆర్ కే ఎంటర్ప్రైజెస్ నారాయణపురం వెంకటరెడ్డి కుమారుడు కారు వేగంగా నడుపుతూ నాగరాజును ఢీకొట్టినట్లు సమాచారం. చుట్టు ప్రక్కల వారు 108 వాహనం కు సమాచారం ఇవ్వగా వాహనం నడిపే మురళీకృష్ణ వాహనం ద్వారా సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అపారాత్మక స్థితిలో ఉన్న నాగరాజుకి సిపిఆర్. (Cpr = ఆర్డీవో పల్మనరీ క్యూట్ టేషన్ చేస్తూ ఆక్సిజన్ ఎక్కించారు గాయాలకు కట్లు కట్టారు. సైలెంట్ బాటిల్స్ ఎక్కించి వైద్య సేవలు అందించారు. నాగరాజు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రోగ్రాం మేనేజర్ షేక్ నజీరుద్దీన్ ఆదేశాల మేరకు గోల్డెన్ అవర్ పాటిస్తూ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వేంసూరు గ్రామస్తులు స్నేహితులు ఆప్తులు బంధువులు
నాగరాజు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు.
మర్లపాడు గ్రామస్తులను అభినందించిన నజీరుద్దీన్ యాక్సిడెంట్ జరిగిన మరుక్షణమే సకాలంలో స్పందించి
ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ నజీ రుద్దీన్. గ్రామస్తులను అభినందించారు. ఫోన్ చేయగానే వచ్చిన 108 వాహన వైద్య సిబ్బందికి గ్రామస్తులు అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *