తేది :09-01-2026 నల్గొండ జిల్లా TSLAWNEWS దేవరకొండ నియోజకవర్గం పులిజాల గోవర్ధన్.
నల్గొండ జిల్లా:స్థానిక సోలిడార్ తెలంగాణ బదిరుల ఆశ్రమ పాఠశాలకు కె.ఎం.పి హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో జి సాదానందం ఆర్థిక సహకారంతో విద్యార్థిని విద్యార్థులకు శుక్రవారం క్రీడా దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేఎంపి హెల్పింగ్ హాండ్స్ నిర్వాహకులు మాట్లాడుతూ సోలిడార్ తెలంగాణ బదిలీల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వివిధ క్రీడలలో ప్రతిభావంతులై ఉత్తమ అవార్డులు పొందిన సందర్భాలు ఉన్నాయి అన్నారు.ఇలాంటి విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో క్రీడా దుస్తులను పంపిణీ చేశామన్నారు. ఈ సందర్భంగా క్రీడా దుస్తుల దాత జై మారుతి బెంగళూరు బేకరీ నిర్వాహకులు జి సదానందం గారిని పాఠశాల నిర్వాహకులు అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కెఎంపి హెల్పింగ్ హాండ్స్ నిర్వాహకులు ఏరుకొండ రాము,కూన భానుచందర్, పాఠశాల నిర్వాహకులు దార్ల భాస్కర్, భూతరాజు భరత్ కుమార్, నాగార్జున రెడ్డి, నెల్లికంటి గోపి,వసుకుల పరమేష్,లచ్చిరాం,సురేష్,చంద్రయ,వినోద్ తదితరులు పాల్గొన్నారు.