కొండగట్టు అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ చేసిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

తేది:09-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన 31 బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 83 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు,వికలాంగులు, ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లతో కలిసి బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ:
లక్షలాది రూపాయలు అప్పులు చేసి సామాగ్రి తెచ్చుకున్న దుకాణదారులు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన దుస్థితిని చూసి ప్రజా ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు.
ప్రమాద ఘటనను తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, జిల్లా నుండి సమగ్ర నివేదిక సమర్పించామని తెలిపారు. బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి నుంచి రూ.83,12,000 రూపాయలు విద్యుత్ సంస్థ నుంచి రూ.29 లక్షలు, డీఆర్‌డీఓ ద్వారా మరో రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించడం సంతోషకరమన్నారు.
అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులు మళ్లీ యథావిధిగా వ్యాపారం చేసుకునేలా భవిష్యత్తులో కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
అదేవిధంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, కొండగట్టు, ధర్మపురి, కోటిలింగాల ప్రాంతాలను టెంపుల్ సిటీ కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని, కొండగట్టు గిరి ప్రదక్షిణ మార్గం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని తెలిపారు.

ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం మాట్లాడుతూ:
కొండగట్టు ప్రాంతంలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న వారి దుకాణాల్లో అగ్ని ప్రమాదం వారి కుటుంబాలను చిన్నభిన్నం చేసింది.
వారి పరిస్థితి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళగా హామీ ఇచ్చిన మాట కు కట్టుబడి బాధితులను ఆదుకోవడం జరిగింది.
ప్రజల కష్టాల్లో తోడుంటానని ప్రభుత్వం ఏర్పడినప్పుడే చెప్పామని, నియోజకవర్గం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని తెలిపారు.ప్రభుత్వం కొండగట్టు ఆలయ అభివృద్ధి కి భారి నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ:
ప్రమాద ఘటన తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి జిల్లా నుండి సమగ్ర నివేదిక సమర్పించామని తెలిపారు. అగ్ని ప్రమాదంలో
సర్వం కోల్పోయిన వ్యాపారులు ప్రభుత్వం అందించిన సహాయంతో తిరిగి వ్యాపారాలు ప్రారంభించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని తెలిపారు.
ప్రమాద బాధితులు ప్రభుత్వం తొందరగా స్పందించి ఆదుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మాకు అన్నివేళలా అండగా మద్దతు ఇచ్చిన సంక్షేమ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మాకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, డిఆర్డివో రఘువరన్, ఎస్.ఈ సుదర్శన్, డి.ఈ గంగారాం, ఎమ్మార్వో, ఎంపిడివో, విద్యుత్ శాఖ అధికారులు, ఇతర అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *