విద్యార్థులతో ముచ్చటించి పాఠాలు చదివించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.

తేది:09-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా :పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఉపాధ్యాయ సిబ్బందిని ఆదేశించారు.
శుక్రవారం రోజున జగిత్యాల జిల్లా మల్యాల మండలం కేంద్రంలోని కస్తూర్భా గాంధీ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల తీరును పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రతి క్లాస్ రూమ్ లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. అదే విధంగా ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని హాజరు పట్టికను పరిశీలించారు. పాఠశాలలోని ప్రతీ విద్యార్థి పై ప్రత్యేక దృష్టి సారించాలని, సర్కారు బడుల్లో క్వాలిఫైడ్ ఉపాద్యాయులు పనిచేస్తున్నారని, భావి తరాలకు అవసరమైన విద్యా బోధన చేయడం జరుగుతున్నదని తెలిపారు.
విద్యార్థులతో ముఖాముఖి సంభాషణ జరిపి వారికి పాఠాలు చదివించి వారి బోధన స్థితిగతులను ప్రత్యేకంగా పరిశీలించారు. తరగతుల నిర్వహణ, పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అనే విషయాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, భోజన తయారీ విషయంలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అదేవిదంగా ఒప్పంద నిర్వాహకుడితో మాట్లాడి నాణ్యతతో కూడిన సరుకులు అందించాలని తెలిపారు.
పాఠశాల తరగతి గదులలో పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలు తొలగించి, శానిటేషన్ చేయించాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాల ఉపాధ్యాయులు సమయపాలన తప్పకుండా పాటించాలని ఆదేశించారు.
ఈ పరిశీలనలో ఆర్డీవో మధు సూదన్, డి.ఈ.వో. కె. రాము,సంబంంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *