జగిత్యాల గొల్లపల్లి రోడ్డు తాతమ్మ దగ్గర కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన చెత్త – పట్టించుకోని మున్సిపల్ అధికారులు.

తేది:09-01-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS జగిత్యాల రూరల్ రిపోర్టర్ జి తిరుపతి రిపోర్టర్

జగిత్యాల మున్సిపల్ ఆఫీస్ కు కూతవేటు దూరంలో చెత్త కుప్పలు పేరుకు పోతున్నాయి.జగిత్యాల నుండి గొల్లపల్లి రోడ్ వెళ్ళే రహదారి లో హెచ్ పి పెట్రోల్ బంక్ తాతమ్మ దగ్గర మోతే రోడ్డం వద్ద గత కొన్ని నెలలుగా మున్సిపల్ సిబ్బంది చెత్త కుప్పలు తొలగించట్లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రతి రోజు మున్సిపల్ డంపింగ్ యార్డ్ వాహనాలు ఇటు వైపునే వెళ్తాయి కాని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది ప్రతి ఏటా బతుకమ్మ ఉత్సవాలు కూడా ఇక్కడే నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో బతుకమ్మ పార్కును ఏర్పాటు చేయాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. వెంటనే ఈ చెత్త కుప్పలను తీసివేయాలని ప్రజలు కోరుతున్నారు. వాగులో చెత్తను వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. వాగు మురికితో కలుషితం అవుతుంది అని తెలిపారు. పందుల మందలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *