తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు గౌరవ MLC తీన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు,బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలనీ పరకాల మండలంలో MRO గారికి వినతిపత్రం సమర్పణ-TRP ప్రధాన కార్యదర్శి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్.

తేది:09-01-2026 TSLAWNEWS హనుమకొండ జిల్లా, హనుమకొండ నియోజకవర్గం ఇన్చార్జి దొమ్మటి పవన్ గౌడ్.

హనుమకొండ జిల్లా, హన్మకొండ: రాష్ట్రంలో వెనుకబడిన తరగతులను కావాలనే నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి ఇది ప్రత్యక్ష నిరసన అని,ఎస్సీ, ఎస్టీల తరహాలోనే తక్షణమే బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధంగా అమలు చేయాల్సిందే అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.
గురువారం హన్మకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలో MRO గారిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా అశోక్ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలకు బడ్జెట్‌లో జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించకపోవడం తీవ్రమైన అన్యాయం అన్నారు.
బీసీలకు నిజమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం జరగాలంటే బీసీ సబ్ ప్లాన్ ఒక్కటే పరిష్కారం అని స్పష్టం చేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించి చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాలి, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇది వినతిపత్రంతో ముగిసే పోరాటం కాదని, బీసీల హక్కులు సాధించే వరకూ రాజ్యాధికార పోరాటం ఆగదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ గౌడ్,ప్రధాన కార్యదర్శి బగ్గి రాజు,రాష్ట్ర నాయకులు పోలు రాజు,సోషల్ మీడియా సౌత్ తెలంగాణ కన్వీనర్ మార్త శ్రీనివాస్,ఉమ్మడి వరంగల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ రమణ,బిక్షపతి, బాలినే లక్ష్మి, మంచాల పద్మ, గడ్డం మాధవి,భువనగిరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *