గురువులు, మిత్రుల జ్ఞాపకార్థం మండల స్థాయి క్రీడోత్సవాలు.

తేది:8-1-2026, జనగామ జిల్లా, TSLAWNEWS, పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker.

జనగామ జిల్లా: పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో 1990-91 వ బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఈనెల 10, 11 తేదీలలో మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్ క్రీడలను నిర్వహించుచున్నారు
వారి బాల్యం నుండి పదవ తరగతి వరకు కలిసి చదువుకొని వీరిని విడిచి వెళ్లిన మిత్రులను, విద్యాబుద్ధులు చెప్పి స్వర్గీయులైన గురువుల జ్ఞాపకార్థం కొరకు ఈ క్రీడలను 1990-91వ 10 వ తరగతి పూర్వ విద్యార్థుల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు
కబడ్డీ, వాలీబాల్ క్రీడలలో గెలుపొందిన విజేతలకు12వ తారీఖున జరిగే పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అందజేయనున్నట్లు కమిటీ అధ్యక్షులు గుగ్గిళ్ళ క్రాంతి కుమార్, కార్యదర్శి అశోక్ మహర్షి లు వెల్లడించారు
కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారులు మీయొక్క ఎంట్రీ ఫీజులను టీం వివరాలను తేదీ 9 జనవరి 2026 సాయంత్రం 5 గంటల వరకు 9951781959 , 9701274551 కి కాల్ చేసి నమోదు చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *