తేది:08-01-2026 TSLAWNEWS నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ వనమాల రమేష్.
నల్గొండ జిల్లా, దేవరకొండ :దేవరకొండ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జనవరి 2026 నెలవారి సమావేశం అధ్యక్షులు తాడిశెట్టి నరసింహ గారి అధ్యక్షతన ఈ రోజు జరిగినది. ఈ సందర్బంగా వారు, కార్యదర్శి అంకం చంద్రమౌళి, సహా అధ్యక్షులు గంగిడి దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆకులపల్లి ఐజాక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన 5 విడతల కరువు బత్యం, పి. ర్. సి మంజూరు చేసి 2023 నుండి బకాయిలు ఒకే సారి అందజేయాలనిమరియు హెల్త్ కార్డుపై కార్పొరేట్ వైద్యాశాలలో అన్ని రకాల వ్యాదులకు ఉచిత వైద్యం అందించాలని, 2024 నుండి ఉద్యోగ విరమణ పొందిన వారికి రావాల్సిన అన్ని బకాయిలు ఏక మొత్తముగా చెల్లించి పెన్షన్ దారులను ఆడుకోవాలని కోరినారు. కోశాధికారి పంగునూరు లింగయ్య ఈ మాసం జమ ఖర్చులు ప్రవేశపెట్టి ఆమోదం పొందినారు.ఆటల కమిటీ పెద్దలు జిల్లా కార్యదర్శి కంచర్ల నారాయణ రెడ్డి, మహమ్మద్ యూసుఫ్ షరీఫ్ మాట్లాడుతూ జనవరి 26 ఘనతంత్ర దినోత్సవం సందర్బంగా పురుష, మహిళా పెన్షనర్లకు క్యారం, చెస్, కుర్చీ, రింగ్ బాల్ ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని ఆసక్తి గలవారు పేర్లు తెలియజేయగలరని కోరినారు. సభ్యులు అలంపల్లి శ్రీనివాస్ మనవడు పుట్టిన సందర్బంగా సభ్యులకు స్వీట్, తేనిటీ విందు అందజేసినారు. సమావేశం అనంతరం అందరికి ఉపాధ్యక్షులు ఆకులపల్లి ఐజాక్ పసందైనా భోజనం ఏర్పాటు చేసినారు.సంయుక్త కార్యదర్శి వనం బుచ్చయ్య స్వీట్ దాతకు, భోజన దాతకు, హాజరైన కార్యవర్గంనకు, కార్యవర్గ సభ్యులకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసినారు.