తేది:08-01-2026 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
వరంగల్ జిల్లా: పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామ్‌చంద్రరావు గారిని జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆధ్వర్యంలో చౌరస్తాలో ఘన స్వాగతం. కాషాయ జెండాలతో భారీ బైక్ ర్యాలీ, శివనగర్‌లో గజమాలతో సత్కారం. రాజశ్రీ గార్డెన్‌లో జిల్లా సమావేశంలో ప్రసంగించారు. శాలువ, త్రిశూలంతో సత్కరించారు.ఓరుగల్లు ప్రాచీన కాకతీయ రాజధాని, పంచశైవ క్షేత్రాలు కలిగిన నగరం. 30లక్షల జనాభా, పత్తి-వరి ఉత్పత్తిలో No.1. కానీ రేవంత్ ప్రభుత్వాలు అణచివేశాయి. కేంద్రం స్మార్ట్ సిటీ, అమృత్, HRIDAY పథకాలు, టెక్స్‌టైల్ పార్క్, మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు నిధులు కేటాయించింది. స్థానిక నేతల అవినీతి వల్ల అభివృద్ధి ఆగింది.కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలిచి కాకతీయ వైభవం తీర్చిదిద్దాలి . కాంగ్రెస్ హామీలు (UGD, మాస్టర్ ప్లాన్) అమలు లేదు. హిందూ దేవాలయాల దాడులు, NIA సోదాలు పెరిగాయి. డబుల్ ఎంజిన్ సర్కార్‌తోనే వరంగల్ అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎం గౌతమ్ రావు, తూళ్ల వీరేందర్ గౌడ్, వేముల అశోక్, వరంగల్ జిల్లా ఇన్చార్జి కొండపల్లి శ్రీధర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు మార్తనేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్, ఆరూరి రమేష్, మాజీ ఎమ్మెల్సీ టి రాజేశ్వరరావు, జయపాల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రత్నం సతీష్, మాజీ జిల్లా అధ్యక్షులు ఎట్లా అశోక్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరిశంకర్ మల్లాడి తిరుపతిరెడ్డి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మరియు శ్రీరాగం సాగర్ ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.