తేది:08-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAW NEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా: గణపురం మండల కేంద్ర కొత్తపల్లి లో మహిళల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్ని రంగాల్లోనూ అవకాశాలు కల్పించడం జరుగుతుందని గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రం సమీపంలోని కొత్తపల్లిలో ఇందిరమ్మ చీరలను సర్పంచ్ కటుకూరి రాధికా శ్రీనివాస్ పంపిణీ చేశారు.డ్వాక్రా గ్రూపుల్లో లేని మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.మహిళల అభ్యున్నతి కొసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నట్లు ఈ అవకాశాలను అందిపుచ్చుకొని మహిళలు సామాజికంగా రాజకీయంగా ఎదగాలని సర్పంచ్ ఈ సందర్భంగా అన్నారు.మహిళల అభివృద్ధికి తోడ్పాటున అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు సర్పంచ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గణపురం ఉపసర్పంచ్ ఓరుగంటి కృష్ణ గౌడ్ భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కటుకూరి శ్రీనివాస్ గణపురం మండల మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి చోటేమియా వివో ఏ చింతం రమ తదితరులు పాల్గొన్నారు.