పరశురాంపల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ-సర్పంచ్ ను సన్మానించిన మహిళా సంఘాలు.

తేది:08-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.

భూపాలపల్లి జిల్లా: గణపురం మండలంలోని పరుశురాంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గురువారం సర్పంచ్ ఉడుత సాంబయ్య యాదవ్ మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ సాంబయ్య యాదవ్ ను శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీనిధి ఆర్ఎం రజినీకాంత్, దేవేందర్ రావు,సీసీ శకుంతల, సిఏలు పద్మ భారత యాదలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు మానస నవ్య ఎ న్ ఎమ్ లు, ఆశాలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *