తేది:08-01-2026 భూపాలపల్లిజిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంచాలనే సంకల్పంతో సీఎం కప్ 2025 – 26 ఏర్పాటు చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు.గణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే జీఎస్సార్ సీఎం కప్ క్రీడాజ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించి, విద్యార్థులతో కలిసి కొద్దిదూరం ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామాల్లో ప్రతి క్రీడాకారుడిని రాష్ట్రస్థాయి వేదిక వరకు తీసుకెళ్లడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎంకు ద్వారా క్రీడలను జీవితంగా మార్చుకునే అవకాశాన్ని యువతకు అందిస్తామన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రతిభ ఉన్న క్రీడాకారుల భవిష్యత్తు వృధా కాకూడదని, యువత క్రీడల్లో ముందుకు రావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి జిల్లా క్రీడల శాఖ అధికారి రఘు హ్యాండ్ బాల్ జనరల్ సెక్రెటరీ కుమార్ యాదవ్ పాఠశాల హెచ్ఎం సతీష్ స్థానిక సర్పంచి కటుకూరి రాధిక శ్రీనివాస్ ఉప సర్పంచ్ కృష్ణ నాయకులు విడిదినేని అశోక్,ఓద్దుల అశోక్ రెడ్డి, మండల అధ్యక్షులు రేపక రాజేందర్, ఎండి చోటే మియా,తాళ్లపల్లి భాస్కరరావు, సోషల్ మీడియా ఇన్చార్జి జోడు ప్రదీప్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.