తేది:8- 01- 2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ మీ పాపయ్య చారి.
మెదక్ జిల్లా: ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని సర్పంచ్ సౌమ్య సురేష్ గౌడ్ అన్నారు. గురువారం లబ్ధిదారులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు చేపడుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. గ్రామ కార్యదర్శి ప్రభాకర్, వార్డ్ మెంబర్లు పాండు, , నాయకులు సురేష్ గౌడ్, దశరథ్, సుధాకర్, నక్క సూర్య కుమార్, మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.