తేది:08-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS జహీరా సంఘం మండలం రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా, జహీరా సంఘం మండలంలోని మేధాపల్లి గ్రామంలో ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ అరుణ యువ నాయకుడు అభిలాష్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పేద మహిళలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న చీరల కార్యక్రమం, ఇది గత బతుకమ్మ పండుగ సమయంలో ప్రారంభమైంది, అర్హులైన ప్రతి మహిళకు నాణ్యమైన చీరలను అందజేయడమే లక్ష్యం, అయితే ఈ పంపిణీ ఇంకా కొనసాగుతోంది.తెలంగాణ లో అర్హులైన ప్రతి పేద మహిళకు ‘ఇందిరమ్మ చీరలు’ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చీరలు అందని దాదాపు 15 లక్షల మంది మహిళలకు సంక్రాంతి పండుగలోపు పంపిణీ చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అయితే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొన్ని చోట్ల వాయిదా పడగా, మళ్లీ చీరల పంపిణీని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. రేషన్ కార్డు లేని వారు ఆధార్ లేదా ఓటర్ కార్డు చూపించి ఈ చీరలను పొందవచ్చు. కార్యక్రమంలో సర్పంచ్ అరుణ ఉపసర్పంచ్ మాజార్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.