తేది:08-01-2026 TSLAWNEWS తెలంగాణ రాష్ట్రం
PROPRIETOR & EDITOR కోవూరి సత్యనారాయణ గౌడ్
తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం (టీ జే ఎస్ ఎస్) జగిత్యాల జిల్లా కార్యవర్గం, జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత ను మర్యాదపూర్వకంగా కలిశారని ఒక ప్రకటనలో తెలిపారు. జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత కు పూల మొక్క ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారని తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం (టీ జే ఎస్ ఎస్) జగిత్యాల జిల్లా ఇంచార్జి, టీ జే ఎస్ ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆకుల సంజయ్ రెడ్డి, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాచమల్ల సుభాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షలు దారుకోట శేఖర్, ప్రధాన కార్యదర్శి ఆర్ .రాజేందర్, సంయుక్త కార్యదర్శులు ముదాం శ్రీనివాస్ ,గిద్దె తిరుపతి, సిగిరి రాజరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ జంగా శ్రీనివాస్ , కార్యవర్గ సభ్యులు లింగా వెంకటేశ్వర్ రెడ్డి, కాసిరెడ్డి నాగరాజు, ఏనుగుల లక్ష్మినారాయణ, రాడే శ్రీనివాస్, రమేష్ పాల్గొన్నారు.