తేది:07-01-2026 భూపాలపల్లిజిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం ప్రజా పాలనలోనే మహిళలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని బుద్ధారం సర్పంచ్ విడిదినేని శ్రీలత అశోక్ అన్నారు. బుధవారం బుద్ధారం గ్రామంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసారు. బుద్ధారం సర్పంచ్ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా గ్రూపుల్లో లేని మహిళలకు గ్రామ సర్పంచ్ విడిదినేని శ్రీలత చీరలను పంపిణీ చేశారు కాగా గ్రామంలో 900 మంది డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలకు గతంలోనే చీరలను పంపిణీ చేయగా ఇప్పుడు డ్వాక్రా గ్రూపులో లేని 350 మంది మహిళలకు సర్పంచ్ చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ శ్రీలత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన లో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయంగా వివిధ సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నట్లు అందులో భాగంగానే సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఆర్టీసీకి అద్దె బస్సులను ఇవ్వడం అదేవిధంగా పెట్రోల్ పంపులు నిర్వహణ వంటివి డ్వాక్రా మహిళ గ్రూపుల ద్వారా ఏర్పాటు చేయించి తద్వారా మహిళా సాధికారత కొసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావుకు సర్పంచి కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో గణపురం మండల ఇన్చార్జి ఏపిఎం ఎండి ఇమామ్ వివో ఏలు విజయేందర్ అరుణ కవిత పద్మ వివో అధ్యక్షురాలు జరీనా, పుష్ప తదితరులు పాల్గొన్నారు.