తేది:7-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట మండలం క్రైమ్ రిపోర్టర్ బి. ప్రసాద్ గౌడ్.
సంగారెడ్డి జిల్లా: బుధవారం రోజున సదాశివపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో గల ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలలో ఆశ్రయ్-ఆకృతి మరియు క్వాల్కం(ఎన్‌ఆర్‌ఐ) సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలను డాక్టర్లు శివరాములు, భార్గవరావు మరియు ఆశ్రిత ఆధ్వర్యంలో నిర్వహించబడినట్లు మండల విద్యాధికారి ఎన్.శంకర్ తెలిపారు.
పాఠశాలలోని అందరూ విద్యార్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు,కంటి, ముక్కు, చెవి మరియు గొంతు పరీక్షలు నిర్వహించడంతో పాటు, అవసరమైన వారికి తగిన సూచనలు అందించబడినట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం ఉండాలనే ఉద్దేశంతో ఆశ్రయ్-ఆకృతి మరియు క్వాల్కం(ఎన్‌ఆర్‌ఐ) సంస్థ ముందుకొచ్చి ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందించడం అభినందనీయమని,ఈ సందర్భంగా ఇక్కడకు విచ్చేసిన ఆశ్రయ్-ఆకృతి మరియు క్వాల్కం(ఎన్ఆర్ఐ)సంస్థకు, వైద్య బృందానికి మండల విద్యాధికారి ఎన్.శంకర్ కృతజ్ఞతలు తెలిపారు, ఎన్ఆర్ఐ సంస్థ ద్వారా మన మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముందు,ముందు కూడా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.
అనంతరం ప్రాథమిక పాఠశాల ఇస్త్రీతాబాద్ లో విద్యార్థులచే తెలుగు మరియు ఇంగ్లీష్ లలో చదివించి,వ్రాయించడం జరిగిందని మండల విద్యాధికారి ఎన్.శంకర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాలల హెచ్.ఎంలు మహేందర్, జయంతి,యూసుఫ్,టీచర్స్, సిఆర్పి రాజేశ్వర్,వైద్య సిబ్బంది, ఎన్‌ఆర్‌ఐ సంస్థ ప్రతినిధులు మరియు విద్యార్థులు పాల్గొన్నారని మండల విద్యాధికారి ఎన్.శంకర్ తెలిపారు.