
తేది:07-01-2026 TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.
సంగారెడ్డి జిల్లా: బీరంగూడ జీహెచ్ఎంసీ పరిధిలోని బీరంగూడ గుట్టపై వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో 118 రోజుల హుండీ లెక్కింపు కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. భక్తుల మొక్కులు నెరవేరిన ఆనందానికి ప్రతీకగా హుండీకి లక్షల కానుకలు సమకూరడం భక్తుల్లో విశేష ఉత్సాహాన్ని నింపింది.
ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం పరిశీలకులు ఈఓ శ్రీనివాస్ సమక్షంలో, ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మరియు ఆలయ ఈవో శశిధర్ గుప్త ఆధ్వర్యంలో పారదర్శకంగా జరిగింది. కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హుండీ లెక్కింపులో సహకరించారు.
హుండీ లెక్కింపులో మొత్తం రూ.10,04,280 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శశిధర్ గుప్త గారు తెలిపారు. ఈ మొత్తాన్ని ఆలయ ఖాతాలో జమ చేసి, రాబోయే శివరాత్రి మరియు జాతర ఉత్సవాల నిర్వహణతో పాటు ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ యాదవ్ గారు మాట్లాడుతూ, భక్తుల సహకారంతో పూర్తిస్థాయి పారదర్శకతతో హుండీ లెక్కింపు నిర్వహించామని చెప్పారు. భక్తుల విశ్వాసమే ఆలయ బలం అని, వారి నమ్మకానికి తగినట్లుగా ఆలయ వసతులు, ఉత్సవాల నిర్వహణను మరింత మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు దండు రమేష్, చంద్రశేఖర్, లక్ష్మీకాంత్ రావు, దీపక్ గౌడ్, శ్రీనివాస్ జె, ఎల్లయ్య, మహేష్ తో పాటు మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
దైవానుగ్రహంతో భక్తుల కోరికలు నెరవేరిన ఆనందానికి నిదర్శనంగా హుండీ లెక్కింపులో లక్షల ఆదాయం రావడం బీరంగూడ గుట్టలోని మల్లికార్జున స్వామి మహిమకు మరోసారి సాక్ష్యంగా నిలిచింది.