తేది:7-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.
మెదక్ జిల్లా:మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ ఎదురుగా మెదక్ జిల్లా డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్రీ భవన స్థలానికి మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గ ప్రజల కోసం, వారి శ్రేయస్సు కోసం,అహర్నిశలు పాటుపడుతానని పేర్కొన్నారు..
వందల కోట్ల రూపాయలతో మెదక్ నియోజకవర్గన్నీ అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.. నియోజకవర్గంలో విద్యా,
వైద్యన్నీ మెరుగుపరిచే విధంగా పనిచేయడం జరుగుతుంది అన్నారు.అందులో భాగంగా రామాయంపేటలో 25 ఎకరాలలో యంగ్ ఇండియా స్కూల్, ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు..కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి తరగతులను కూడా ప్రారంభించడం జరిగింది. గత 10 సంవత్సరల నుండీ మెదక్ నియోజకవర్గం వెనుకబడిందని విమర్శించారు..ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత మెదక్ నియోజకవర్గన్ని అభివృద్ది దిశలో తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తోడుపునూరి చంద్రపాల్ మాజీ కౌన్సిలర్లు మెదక్ జిల్లా డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్రీ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.