తేది:07-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ప్రత్యేక అధికారులకు ఆదేశించిన మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ కేర్ టేకర్లు కం వార్డెన్లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జగిత్యాల మరియు పెద్దపల్లి జిల్లాల కేజీబీవీ ప్రత్యేక అధికారులకు మరియు మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ కేర్టేకర్లు వార్డెన్ లకు కలిపి సంయుక్తంగా జగిత్యాల కేంద్రంలోని ఆర్కే కన్వెన్షన్ హాలులో ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం రోజున జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ .లతా ప్రారంభించి ఇట్టి శిక్షణను తప్పనిసరిగా వినియోగించుకొని బాలిక విద్య ఆవశ్యకతను , వారి ఆరోగ్య ప్రాముఖ్యతను ,కేజీబీవీ బడ్జెట్ సద్వినియోగం గురించి, పాఠశాలలోని డిజిటల్ టెక్నాలజీ వినియోగం గురించి, శారీరక మానసిక ఆరోగ్య విషయాలపై ఈ ఐదు రోజులలో మంచి అవగాహనను ఏర్పరచుకొని మీమీ పాఠశాలల్లో శిక్షణలో నేర్చుకున్న అంశాలను బాధ్యతగా నెరవేర్చుతూ బాలికల విద్యా ప్రగతికి బాటలు వేయాలని ఆకాంక్షించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము , మాస్టర్ ట్రైనర్స్ మరియు జిల్లా సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు సత్యనారాయణ, నీరజ మరియు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.