
తేది:07-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సంగారెడ్డి పట్టణం రిపోర్టర్ బంగ్లా సాయికుమార్.
సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి పట్టణంలో బైపాస్ రోడ్డు సమీపంలో గల శ్రీ భవాని మాత ఆలయాన్ని సందర్శించిన మెదక్ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ రఘునందన్ రావు గారిని మర్యాదపూర్వకంగా టీఎస్ లాన్యూస్ సంగారెడ్డి జిల్లా చీఫ్ అడ్వైజర్ ఎర్ర శ్రీహరి గౌడ్, శ్రీ భవాని మాత ఆలయం కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మరియు శంకర్ కలిశారు. ఇటి తరుణంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన యువతరం ని ఉద్దేశించి మాట్లాడారు, చిన్న వయసులో ఉన్న యువత భారతీయ జనతా పార్టీ నుండి కార్యకర్తలుగా ఉన్నవారు గెలవడం ఆనందించదగ్గ విషయమని తెలియజేశారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పర్యటనలో భాగంగా సంగారెడ్డి బైపాస్ సమీపంలో ఉన్న బిజెపి నాయకులను కార్యకర్తలను మరియు నివాసులను పేరుపేరునా పలకరించి మర్యాదపూర్వకంగా మాట్లాడారు.