తేది:07-01-2026 హన్మకొండ జిల్లా TSLAWNEWS హనుమకొండ నియోజకవర్గం ఇంచార్జ్ దొమ్మటి పవన్ గౌడ్.
హనుమకొండ జిల్లా :తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరే షన్ ద్వారా ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంత్ అన్నా కా సహారా మిస్కీనో కే.లియే’ పథకాల కింద మీ సేవ ఆన్లైన్లో దరఖాస్తు లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి టి.విజయేందర్‌రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. అర్హులైన వారు tgobm-m-r.c-f-f.gov.in వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసు కోవాలని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తులను ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు సమర్పిం చాలని పేర్కొన్నారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన ద్వారా వితంతువులు, విడాకు లు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళలకు చిన్న వ్యాపారాలకు ఒక్కోరికి రూ.50 వేల ఆర్థిక సాయం లభిస్తుందని పేర్కొ న్నారు. రేవంతన్నా కా సహారా మిస్కీనో కే లియే పథకానికి ఫఖీర్, దుదేకుల వర్గాలకు చెం దిన అర్హులకు మోపెడ్ వాహనాలు మంజూరు చేస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు ఎం ఏ.ఫహీం, ఫీల్డ్ అసిస్టెంట్, 79811 96060 నం బరు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు.