కిష్టారెడ్డి పేట – పటేల్గూడ సహా 8 గ్రామాలకు ప్రత్యేక డివిజన్ కోరుతూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారికి వినతి.

తేది:07-01-2026 TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.

సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరువు నియోజకవర్గ పరిధిలోని కిష్టారెడ్డి పేట, పటేల్గూడతో పాటు మొత్తం 8 గ్రామ పంచాయతీలను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామాల ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులు కలిసి పటాన్‌చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా తాజా మాజీ ఎంపీపీ అమీన్‌పూర్ ఈర్ల దేవానంద్ గారు, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి గారు, పటేల్గూడ మాజీ సర్పంచ్ ఈర్ల నితీష్ శ్రీకాంత్ గారు, కిష్టారెడ్డి పేట మాజీ సర్పంచ్ కృష్ణ గారు, బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు గారు తదితరులు పాల్గొన్నారు. అలాగే 8 గ్రామాల వార్డు సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరై ఈ వినతికి మద్దతు తెలిపారు.
కిష్టారెడ్డి పేట, పటేల్గూడతో పాటు ఈ 8 గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ప్రత్యేక డివిజన్ ఏర్పాటుతో పరిపాలనా సౌలభ్యం పెరిగి రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక వసతులు వేగంగా అందుతాయని నాయకులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. వినతికి స్పందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు, గ్రామాల అభివృద్ధే తన లక్ష్యమని, ప్రత్యేక డివిజన్ ఏర్పాటు కోసం సంబంధిత శాఖలతో చర్చించి తన వంతు పూర్తి ప్రయత్నం చేస్తానని స్పష్టంగా తెలిపారు.
గ్రామాల పేర్లతోనే ప్రత్యేక డివిజన్ ఏర్పాటు కోరడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. “మా గ్రామాలకు గుర్తింపు, మా ప్రజలకు గౌరవం” అన్న భావనతో ప్రజల్లో కొత్త నమ్మకం, ఐక్యత కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *