తేది:07-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేస్తుందని ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ధర్మారావుపేట సర్పంచ్ పూజారి రాజేందర్ గౌడ్ అన్నారు. బుధవారం అంగన్వాడి సూపర్వైజర్ లక్ష్మీ ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం వీ హెచ్ ఎన్ డి కార్యక్రమాన్ని సర్పంచ్ పూజారి రాజేందర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిన్నారులకు అక్షరా భ్యాస కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సర్పంచ్ పూజారి రాజేందర్ గౌడ్ ను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో జిలిపరపు సాయిలు, సదానందం,బొల్లం రాజమొగిలి,పూరటి శివ,గడ్డం వెంకటేశ్వరు మద్దె దేవేందర్ అంగన్వాడి టీచర్లు చందా ప్రసన్న లతో పాటు ఏఎన్ఎం లుఆశ వర్కర్లు పాల్గొన్నారు.