తేది:07-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పురాతన హైస్కూల్లో జరుగుతున్న స్కూల్ ఐ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ జి సుజాత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు మొత్తం 41 వేల 23 మంది చిన్నారులు గాను ఇప్పటివరకు 33 స్కూళ్లలో 6,662 మంది విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించామని ఇందులో 33 మందిని హయ్యర్ హాస్పిటల్ కు రిఫర్ చేశామని, దృష్టిలోపం కలిగిన 459 మందికి కంటి అద్దాలు పంపిణీ చేస్తామని తెలిపారు. పిల్లలందరూ పోషకాహారాన్ని ఆకుకూరలు,క్యారెట్, బొప్పాయి పండ్లను ఎక్కువగా తీసుకోవాలని, కన్నులను సంరక్షించుకోవాలని , ఎక్కువగా సెల్ ఫోన్లు, టీవీలు చూడడం చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్,ఆర్ బి ఎస్ కే వైద్యులు డాక్టర్ సురేందర్, డాక్టర్ విద్య, ఎన్ హెచ్ ఎం, డి పీ ఓ రవీందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఆఫ్తాల్మిక్ ఆఫీసర్ తిరుపతి , సూపర్వైజర్ మంకిడి శ్రీనివాస్ వైద్య సిబ్బంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.