తేది:7-1-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.
సంగారెడ్డి జిల్లా: పసల్వాది గ్రామం దగ్గరలో గల జ్యోతిర్
వాస్తు ఆశ్రమం వారు ఫిబ్రవరి 15వ తేది మహాశివరాత్రి నాడు జరిగే 1008నది తీర్థమూలచే జరిగే నిర్మితమవుతున్న జలలింగా అర్చన కరపత్రం విడుదల చేసిన ఆశ్రమ భక్తులు. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వారు ప్రత్యేక విశిష్టత కలిగిన ప్ర ప్రథమ జల లింగమును సంగారెడ్డి జిల్లాలో 1008 నది తీర్థముల ద్వారా నిర్మితం చేయడం అనేది సంగారెడ్డి జిల్లా వాసులు చేసుకున్న జన్మజన్మల సుకృత ఫలితం గా భావించి తేది:08-02-2026 నుండి 23-02-2026 రోజు వరకు జరిగే కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని జల లింగ దర్శనం చేసుకొని ఆ భగవనామ స్మరణలో ఉంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ యొక్క గొప్ప పుణ్యకార్య మహోత్సవంలో పాల్గొనడానికి అన్ని జిల్లాల వారికి అన్ని ప్రాంతాలకు వారికి తెలిసే విధంగా ఇట్టి సమాచారాన్ని పంపించి అందరి జీవితాల్లో భగవాన్ నామ స్మరణతో ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు అందరికీ చెందాలని, అందరిపై చల్లని దీవెనలు ఉండాలని తెలియజేశారు.