డీ.టీ.ఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ -మెరుగైన ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించడంలోఉపాధ్యాయులదే కీలక పాత్ర -ఎంపిడీఓ వేదవతి.

తేది:6-01-2026 జనగామ జిల్లా TSLAWNEWS పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker.

జనగామ జిల్లా : విలువలు దిగజారుతున్న నేటి సమాజంలో అన్ని సమాజిక వర్గాలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది మెరుగైన సమాజాన్ని రూపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పాలకుర్తి మండల అభివృద్ధి అధికారి వేదవతి ప్రశంసించారు. ఉపాధ్యాయులు తల్చుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరని విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాడంలో ముందుంటారని కొనియాడారు. ఈ సందర్భంగా వారు వృత్తి నిబద్దత-సామాజిక బాధ్యత తో ముందుకు సాగుతున్న డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను, డైరీ లను మండల విద్యాశాఖాధికారి పోతుగంటి నర్సయ్యతో కలసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్షలు శరీఫ్ , మండల అధ్యక్షలు చిదురాల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి దేవగిరి సూర్యప్రకాష్ మండల బాధ్యుల కమలాకర్, అశోక్ , మెహరున్నిసా , విజేందర్ , శ్రీనివాస్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *