పాత పెన్షన్ పునరుద్ధరించాలి టీఆర్టీఎఫ్ మండల అధ్యక్షుడు కుమారస్వామి ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరణ.

తేది:06-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.

భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టిఆర్టీఎఫ్) మండల అధ్యక్షుడు ఇజగిరి కుమారస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టిఆర్టీఎఫ్ 2026 నూతన క్యాలెండర్‌ను ప్రధానోపాధ్యాయులు దేసు సతీష్ కుమార్ ఆవిష్కరించారు.
​ఈ సందర్భంగా యూనియన్ మండల అధ్యక్షుడు ఇజగిరి కుమారస్వామి మాట్లాడుతూ.. సీపీఎస్ వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక నష్టానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పదవీ విరమణ చేసిన వారికి ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో టీఎస్సీపీఎస్ఈయూ జిల్లా అధ్యక్షుడు ఎండి దిల్షాద్, ప్రధానోపాధ్యాయులు దూలం కుమారస్వామి, జలంధర్, రాంబాబు, రమేష్, శ్రీనివాస్, దేవేందర్, పీడి సరిత తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *