సైబర్ మోసాల నివారణకు గ్రామీణ ప్రాంతాల్లో కళాజాత.

తేది:06-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.

భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సైబర్ నేరాలకు గురికాకుండా ఉండేందుకుగాను ప్రజలను అప్రమత్తం చేస్తూ మంగళవారం గణపురం మండలం పరుశురాంపల్లి నగరంపల్లి గ్రామాల్లో కళాజాత నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రవేశపెట్టే పథకాలపై ప్రజలలో అవగాహనతో పాటు సైబర్ నేరాల బారిన పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కళాజాతాలో వివరించారు. నాబార్డ్ వారి ఆర్థిక అక్షరాస్యత నిధుల సౌజన్యంతో ఎఫ్ఎల్సి కౌన్సిలర్ ప్రేమ్ కుమార్ సారద్యంలో జాగృతి ఫౌండేషన్ విజయవాడ* వారి కళాజాత బృందాల ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ సైబర్ మోసాల పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలని తెలియని వ్యక్తుల నుండి ఫోన్ కాల్ వచ్చి లాటరీ తగిలింది, బంపర్ ఆఫర్ వచ్చింది, మీ అకౌంట్ లో అమౌంట్ జమ చేస్తాం అని మాయ మాటలు చెప్పి అకౌంట్ నెంబర్, పాన్ కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, లాంటివి అడిగితే ఎట్టి పరిస్థితులలోనూ తెలియజేయవద్దని కళాజాతలో వివరించారు. ఈ కార్యక్రమంలో పరశురాంపల్లి సర్పంచ్ ఉడుత సాంబయ్య యాదవ్ నగరంపల్లి సర్పంచ్ కొడారి హైమావతి ధనుంజయ ఉప సర్పంచ్ దంసాని శ్రీకాంత్ తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ రాజేందర్ రెడ్డి బ్యాంకు అధికారులు కళాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *