మిషన్ భగీరథ ప్రధాన పైపులైను కు మరమ్మతులు.

తేది:06-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.

భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని ధర్మారావుపేటకు వెళ్లే ప్రధాన రహదారి మూలమలుపు వద్ద మంగళవారం గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. గత మూడు నెలలుగా మిషన్ భగీరథ ప్రధాన పైపులైను లీకేజీ తో నీరు వృధాగా పోతుండడంతో సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ లు మిషన్ భగీరథ ఉన్నతాధికారులతో మాట్లాడి మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు మిషన్ భగీరథ సిబ్బంది మరమ్మతులు చేపట్టి పనులు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్, ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణ గౌడ్,కాంగ్రెస్ మండల అధికారి ప్రతినిధి మామిండ్ల మల్లికార్జున్ గౌడ్, బీసీ జేఏసీ నాయకులు బత్తిని శివశంకర్ గౌడ్. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *