శ్రీరామ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో సర్పంచ్ దంపతుల పూజలు.

తేది: 06-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.

భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలోని శ్రీరామ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో సర్పంచ్ ఇంజపల్లి శ్రీనివాస్ సుజాత దంపతులు మంగళవారం పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చందనం, తమలపాకులు దీప ధూప నైవేద్యలతో అభిషేక మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమాలను అర్చకులు వినయ్ నిర్వహించారు. అనంతరం ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో బెక్కo స్వామి- అహల్య దంపతులు, మర్రి లింగమూర్తి, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు అప్పాల శ్రీనివాస్, ఎడవెల్లి అన్వేష్, పొన్నo ఉదయ్, బూర సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *