
తేది :06 -01-2026 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం ఆర్టీసీ అధికారుల్లో కదలిక వచ్చింది ఎట్టకేలకు గణపురం ఆర్టీసీ బస్టాండ్ మరుగుదొడ్లకు మరమ్మతులు ప్రారంభించారు. ఎమ్మెల్యే సొంత మండలంలో ప్రయాణికుల కష్టాలు పట్టని ఆర్టీసీ అనే శీర్షికన సూర్యలో ప్రచురితమైన కథనంతో ఆర్టీసీ డిఎం సింధు , బస్టాండు మరుగుదొడ్లను పరిశీలించారు. మంగళవారం జె ఆంజనేయులు ఆర్టీసీ డిప్యూటీ ఈ ఈ ఏ పరమేశ్వర్ ఏఈ ఎన్ మదూకర్ లు సందర్శించారు. మరుగుదొడ్ల పరిసరాల్లోని సెప్టిక్ ట్యాంకు మరమ్మతులు ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. వారం రోజుల్లో పనులు పూర్తి చేసి మరుగుదొడ్లను వాడుకలోకి తెస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్, ఉప సర్పంచ్, ఓరుగంటి కృష్ణ గౌడ్, బీసీ జేఏసీ నాయకులు పోతర్ల మల్లికార్జున్ యాదవ్, సుంకరి సుధాకర్ రెడ్డి తంగళ్ళపెల్లి వెంకన్న శనిగరపు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.