ఘనంగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు, జనహృదయనేతకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువలు.

తేది:6-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.

మెదక్ జిల్లా : ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ.జనహృదయనేత, పేదల పెన్నిధి, అనునిత్యం ప్రజాసేవ కోసం పరితపించే నాయకురాలు, ఆపదలో నేనున్నానంటు అండగా నిలిచే గొప్ప నాయకురాలు, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,తెలంగాణ తొలి మాజీ డిప్యూటీ స్పీకర్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఏం పద్మ దేవేందర్ రెడ్డి 57 వ జన్మదిన వేడుకలు హైదరాబాద్ వారి నివాసం కొంపల్లిలో మంగళవారం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు,నాయకులు,కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కొంపల్లిలోని వారి నివాసంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల. మల్లికార్జున్ గౌడ్,పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి,మాజీ కౌన్సిలర్లు నాయకుల ఆధ్వర్యంలో పద్మ దేవేందర్ రెడ్డి చేత కేక్ కట్ చేయించారు, పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో ఘనంగా సన్మానించారు.అనంతరం రామాయంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె.జితేందర్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ పుట్టి. విజయలక్ష్మి యాదగిరి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ బాదే. చంద్రం,పట్టణ నాయకులతో కలసి గజమాలతో ఘనంగా సన్మానించి కేక చేయించారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు కలసి కేక్ ను ఒకరికొకరు తినిపించుకొని స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ.. పద్మదేవేందర్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకున్నారు.ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించారు. అదేవిధంగా జిల్లాలోని వివిధ మండల కేంద్రాల్లో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు,కార్యకర్తలు కేకులు కట్ చేసి పద్మ దేవేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ లు జయరాజ్, కిషోర్,ఆర్కే శ్రీనివాస్, మాయ. మల్లేశం,జెల్ల గాయత్రి, సోహెల్, పట్టణ పార్టీ కోకన్వీనర్లు లింగారెడ్డి, జుబెర్ అహ్మద్, కండెల. సాయిలు నాయకులు ప్రభు రెడ్డి, ఏనుగుల. రాజు,శంకర్,నగేష్, మధు, రుక్మా చారి, ఫాజిల్,గోపాల్, సంతోష్, శ్రీనివాస్ గౌడ్,శ్రీను నాయక్ స్వామి నాయక్,మోహన్ నాయక్, ఎంబిపూర్ మహేష్, రంజిత్, కిరణ్,చంద్ పాషా భువన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *