సంగారెడ్డి జిల్లా,సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ జెండా ఎగారాలి. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం లో కార్యకర్తలు, నాయకులకు జగ్గారెడ్డి దిశా నిర్దేశం.

తేది:06-01-2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా చీఫ్ అడ్వైజర్ ఎర్ర శ్రీహరి గౌడ్.

సంగారెడ్డి జిల్లా: శ్రీ వెంకటేశ్వర గార్డెన్ లో మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సంగారెడ్డి సదాశివపేట కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో మున్సిపల్ ఎన్నికల గురించి, అభ్యర్థుల నిర్ణయాల గురించి శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ :

సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీ లలో కాంగ్రెస్ జెండా ఎగరాలి.
రానున్న మూడు సంవత్సరాలు మనం అధికారం లో ఉంటాం, మరో ఐదేళ్లు అధికారం లో తీసుకురావడానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు.
మీ వార్డ్ లలో క్యాండేట్ లను మీరే డిసైడ్ చేసుకోండి.
రిజర్వేషన్ లకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోండి.
గత మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ లు గా పోటీ చేసి గెలిచిన వారు, ఓడిపోయిన వారు పూర్తి బాధ్యత తీసుకోండి,
బిసీ ఉన్న వార్డ్ లు, ఎస్సీ అయిన, ఎస్సీ ఉన్న వార్డ్ లు బిసీ అయిన అంతకుముందు ఆ వార్డుల్లో పోటీ చేసినా, గెలిచిన వారు బాధ్యత తీసుకోండి,
కొత్తగా పార్టీ లో వచ్చిన వారికి కౌన్సిలర్ టికెట్ ఇవ్వం,
పది సంవత్సరాలు అధికారం లో లేనప్పుడు పార్టీ లో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది,
అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల ముందు పార్టీ లోకి వచ్చిన వారికి రెండవ ప్రాధాన్యత,
నేను టీఅర్ఎస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ రూలింగ్ లో ఉన్నా సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీ చైర్మెన్ లు టీఅర్ఎస్ గెలిపించిన.

నా కష్టం తో నేను బీజేపీ నుండి సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా గెలిచిన- శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి.

నా జీవితమంతా ప్రజలే,రాజకీయాలే:

నేను మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి రాను,నన్ను ఎవరు పిలువొద్దు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే నిర్మలను ప్రచారానికి పిలుచుకొండి.
మీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పథకాలు మీరే చెప్పుకుని ఒట్లడగండి,
నేను పోలీసులతో పోరాడి రాజకీయం చేశాను, పోలీసులను అ డ్డం పెట్టుకుని రాజకీయాలు చేయలేదు.
బతిమాలుడుతరా, దండం పెడుతరా ఎదైన చేయండి, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటి ల పై కాంగ్రెస్ జెండా ఎగురవేయండి.
మీరు ఎన్నికల్లో ఎన్ని వాగ్దానా లైన చేయండి.. ఆ వాగ్దానాలను సీఎం రేవంత్ రెడ్డి నీ అడిగి చేయించే బాధ్యత నాది:
సదాశివపేట మున్సిపాలిటీకి, సిడిసి చైర్మెన్ రామ్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి ఆంజనేయులు , వాసిం భాయ్ ఇంచార్జ్ లు గా ఉంటారు.
సంగారెడ్డి మున్సిపాలిటీ కి తోపాజి అనంత్ కిషన్, చిదృప్ప రఘు, జార్జ్, బొంగుల రవి ఇంచార్జ్ లుగా ఉంటారు.
మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఓటమికి ఎవరు ప్రయత్నం చేసినా , టికెట్ రాని వారు వ్యతిరేఖంగా పనిచేసిన నా దగ్గరకు రానివ్వ ను నేను ఒప్పుకోను,
మున్సి పల్ ఎన్నికల్లో మన వారి దగ్గర డబ్బులు లేవని, వేరే డబ్బులున్న వ్యక్తి పోటీ చేస్తా అంటే నేను ఒప్పుకోను,
నా కూతురు కూచి కూడా ప్రచారానికి రాదు,
నేను ప్రచారానికి రాకున్నా సంగారెడ్డి పట్టణ ప్రజలు జగ్గారెడ్డి ని నమ్ముతారు.
నన్ను ఎవరు వచ్చి కౌన్సిలర్ టికెట్ అడగవద్దు,
సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గా కూన సంతోష్ ఉంటాడు,
బిసీ అయినా, బిసీ మహిళా అయిన, జెనరల్ అయిన కూన సంతోష్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గా ఉంటాడు,
వైస్ చైర్మన్ అభ్యర్థి గా షఫీ హఫీజ్ ఉంటాడు,
సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎస్సీ రిజర్వేషన్ అయితే మహేష్ లాల్ చైర్మెన్ గా ఉంటాడు.
కమిటీ లు ఫైనల్ చేసిన వ్యక్తులే ఫైనల్:
ఎవరు టికెట్ కోసం గాంధీ భవన్ వెళ్లి పిసిసి ప్రెసిడెంట్ ను కలిసి ఇబ్బంది పెట్టొద్దు.
సదాశివపేట ఎస్సీ రిజర్వ్ అయితే చిరు చైర్మెన్ అభ్యర్థి గా ఉంటాడు,
కాంగ్రెస్ అభ్యర్థులుగా నిర్ణయిం చిన వారిని ఓడగొట్టే ప్రయత్నం చేసేవారిని ఎన్నికల సమయం అని చూడకుండా సస్పెండ్ చేస్తాను,  అని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో  తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *