మున్సిపల్‌ ఎన్నికల పరిధిలో నోడల్‌ అధికారులు విధులు సమర్థవంతంగా నిర్వహించాలి-జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్‌ సత్యప్రసాద్.

తేది:06-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లాలోని 5 మున్సిపల్‌ పరిధిలో ఎన్నికల నిర్వహణ కొరకు భాగంగా నోడల్‌ అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ బి. సత్యప్రసాద్ అన్నారు.
కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ తో కలిసి రెండో సాధారణ మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై నోడల్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లతో సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ సత్యప్రసాద్ మాట్లాడుతూ:
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల,మెట్ పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపల్‌ ఎన్నికల్లో నోడల్‌ అధికారుకు కేటాయించిన ఆయా విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.
పోలింగ్ కేంద్రాలు మరియు నామినేషన్ కేంద్రాలు మున్సిపాలిటీ వారిగా ఎన్ని ఏర్పాటు చేయాలి మరియు ఎక్కడ ఏర్పాటు చేయాలి అనేది ప్రణాళిక చేసుకోవాలి.
ప్రతి పోలింగ్ స్టేషన్ ను మరియు నామినేషన్ కేంద్రాలను మున్సిపల్ కమిషనర్లు ప్రత్యక్షంగా సందర్శించాలి.
పోలింగ్ సిబ్బంది మరియు ఆర్వో ల నియామకం, శిక్షణ అందించడం డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్ ల ఏర్పాటు, కౌంటింగ్ కేంద్రాల గుర్తింపు, పోలింగ్ స్టేషన్ ల వద్ద మౌళిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల కోడ్ అమలు, ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాల ఏర్పాటు చేయాలని తెలిపారు. 5 మున్సిపాలిటీలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు ఆయా మున్సిపాలిటీలను సందర్శించి ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్లతో చర్చించి, తగు సూచనలు అందించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
అలాగే ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేసి ఎన్నికలను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు, జిల్లా నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *