భూములకు సంబంధించిన పాత కొత్త ఫైళ్లనుపరిశీలించిన-జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.

తేది:6-1-2026 ఖమ్మం జిల్లాTSLAWNEWS వేంసూరు మండలం రిపోర్టర్. మహమ్మద్ బుర్హానుద్దీన్.

పెండింగ్ లేకుండా త్వరితగచ్చిన పూర్తి చేయాలి తాసిల్దార్ మాణిక్ రావును ఆదేశించిన- కలెక్టర్.

పంచాయతీ భవనాలను కూల్చివేసి నూతన భవనాలు నిర్మించండి-కలెక్టర్ ఆదేశాలు.

అంగనవాడి భవనానికి 10 లక్షలు మంజూరు
భవనాలు లేని చోట నిర్మింప చేయండి-ఎంపీ ఓ. ఈజీఎస్ ఏపిఓ లను ఆదేశించిన కలెక్టర్.

ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లాలోని మండల కేంద్రమైన వేంసూరు లోని తాసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించారు. మండలానికి చెందిన అధికారులతో సమావేశ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు.
ప్రధానంగా భూములకు సంబంధించిన పాత ఫైళ్లను కొత్త ఫైళ్లను పెండింగ్ ఫైళ్లను తెప్పించుకొని వాటిని పరిశీలించి, త్వరితగతిన వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దుశేట్టి అనుదీప్ తాసిల్దార్ మానిక్ రావును ఆర్ఐ,. లక్ష్మయ్య శ్యాంసుందర్రావు, ల ను జిపిఓ లను ఆదేశించారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకాలలో చేపట్టిన ఇంకుడు గుంతలు కంద కాల తవ్వకాలు, పనులు, మొక్కల పెంపకం వాటి గురించి ఎంతవరకు వచ్చాయో ఎంపీ ఓ రంజిత్ కుమార్, ఏపీవో విజయ్, ల ను అడిగి తెలుసుకున్నారు. 26 గ్రామపంచాయతీలలో భవనాలు లేని చోట నూతన భవనాలు మంజూరు చేసినట్లు ప్రకటించారు. అదేవిధంగా నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న కారణంగా వాటిని నియంత్రించేందుకు గాను ఆర్ అండ్ బి శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని, డివిజన్లో వారిగా బోర్లు ఏర్పాటు చేసినట్లయితే ప్రయాణికులకు వాహనదారులకు సుమాయాసంగా ఉంటుందని ఆయన అన్నారు. అదేవిధంగా భూములకు సంబంధించిన పట్టాదారుపా పుస్తకాలు పాతవి కొత్తవి, వంశపారపర్యంగా వస్తున్న పుస్తకాలను, హక్కుదారులకు పట్టాదారుపాస్ పుస్తకాలు పరిశీలించి హక్కుదారులకు సర్వేలు నిర్వహించి భూములను అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా ప్రాథమిక వైద్య ఆరోగ్య మండల వైద్యాధికారిణి. ఇందూ ప్రియాంకను సిబ్బందిని సి హెచ్ ఓ వెంకటనారాయణను వైద్యశాఖ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు .
పిల్లల పాఠశాల వివరాలను గూగుల్ వ్యా ప్ ద్వారా వెంటనే పంపించాలని ఎంఈఓ చలంచర్ల వెంకటేశ్వరావును కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రజల నుండి భూములు సంబంధించిన వినతి పత్రాలను కలెక్టర్ తీసుకున్నారు. వెంటనే వాటిని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో
జాయింట్ కలెక్టర్. అజయ్ యాదవ్,తాసిల్దార్ మాని క్ రావు. డిప్యూటీ తాసిల్దార్ బంతిరాం,ఎంఈఓ చలంచర్ల వెంకటేశ్వరావు, ఎంపీ ఓ రంజిత్ కుమార్, ఈజీఎస్ ఏపిఓ విజయ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, శ్యాంసుందర్రావు,లక్ష్మయ్య, ధరణి ఆపరేటర్. రాజేష్, సంపత్, ఆర్ అండ్ బి శాఖ,మరియు ఇరిగేషన్ శాఖ, వ్యవసాయ అధికారి. రామ్మోహన్, గృహ నిర్మాణ శాఖ, మరియు జి పి ఓ లు వెంకటేశ్వరావు మౌలాలి, మస్తాన్, రహీం, ఆంజనేయులు, రాధా, సుహాసిని,ఇతర శాఖల అధికారులు మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *