తేది :06-01-2026 వరంగల్ జిల్లా TSLWANEWS ఇంచార్జ్ వల్లే ప్రశాంత్
వరంగల్ జిల్లా : రెండు సంవత్సరాల నుండి నల్లాల లో నీరు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లక్ష్మీపురం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ నగరంలోని లక్ష్మీపురానికి చెందిన కాలనీవాసులు ఖాళీ బిందెలతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు ఆందోళన చేపట్టారు. గత రెండు సంవత్సరాల నుండి కనీసం మంచినీరు కాదు కదా వాడకానికి కూడా చుక్క నీరు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ నీరు వస్తాయని ఎక్కడికక్కడ గుంతలు తీసి వదిలేసారని, గుంతలో పడి అనేకమందికి గాయాలు కూడా అయ్యాయని ఎన్నోసార్లు బల్దియా అధికారులకు విన్నవించిన పట్టించుకున్న పాపాన పోలేదని ఇప్పటికైనా అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటున్న నేతలు అధికారులు తమకు నిరందించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.