తేది :06-01-2026 TSLAWNEWS మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గ భవాని.
హైదరాబాద్,కూకట్పల్లి:ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా నియమితులైన పుణ్యభూమి ఇన్ఫ్రా కంపెనీ అధినేత అందే శ్రీరామ మూర్తి గారిని కూకట్పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
ఈ సత్కార కార్యక్రమం కేపిహెచ్బి టెంపుల్ బస్ స్టాప్ వద్ద నిర్వహించబడింది. ఈ సందర్భంగా అందే శ్రీరామ మూర్తికి గజ పూలమాలతో ఘన స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు. పార్టీ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, సేవా భావనను గుర్తించి ఈ గౌరవం అందజేశామని సంఘ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మోతేపల్లి భరత్ కుమార్,రంగమోహన్ , సుబ్బారావు , తుమ్మల మోహన్ కుమార్ , చందు, అంజి తదితరులు పాల్గొని, శ్రీరామ మూర్తి గారికి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు, మచిలీపట్నం జిల్లా అభివృద్ధికి మరియు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందే శ్రీరామ మూర్తి కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీకి, ప్రజలకు మరింత సేవ చేయాలని వారు ఆకాంక్షించారు.