వికారాబాద్ జిల్లా లో గల నిరుద్యోగ యువకులకు శుభవార్త.

తేది:06-01-2026 వికారాబాద్ జిల్లా TSLAWNEWS వికారాబాద్ మండలం రిపోర్టర్ లక్ష్మీనారాయణ గొల్ల.

వికారాబాద్ జిల్లా: వికారాబాద్ జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం (ఐటిఐ) క్యాంపస్ లో రేపు (బుధవారం)మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుల్సుభాన్ తెలిపారు. 100 కి పైగా ఫార్మసిస్ట్ ,ఫార్మసిస్ట్ అసిస్టెంట్ ,అప్రెంటిషిప్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వికారాబాద్ పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువకులు జాబ్ మేళాలో పాల్గొని తమ సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు. ఈ ఉద్యోగాలని వికారాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో గల వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఉపాధి కల్పించనున్నారు. ఈ ఉద్యోగాలకి పదవ తరగతి మొదలుకొని ఎం ఫార్మసీ వరకు అర్హత గల వారందరూ పాల్గొనవచ్చని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *