యాదవ మహాసభ మండల అధ్యక్షునిగా దోమల రాజయ్య యాదవ్.

తేది:05-01-2026 భూపాలపల్లిజిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.

భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం అప్పయ్య పల్లి గ్రామానికి చెందిన దోమల రాజయ్య యాదవ్ యాదవమహాసభ గణపురం మండల అధ్యక్షునిగా తెలంగాణ యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు జున్ను సదయ్య యాదవ్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రాజయ్య యాదవ్ గొల్ల కురుమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం లో సమర్ధుడు అని ఎవరికి కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చే స్వభావం కలిగిన నాయకుడు రాజయ్య యాదవ్ సేవా భావం గుర్తించిన యాదవ మహాసభ జిల్లా కమిటీ గణపురం మండల అధ్యక్షులు గా నియమించారు సంఘాన్ని అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు ఈ సందర్భంగా రాజయ్య యాదవ్ మాట్లాడుతూ తనపై జిల్లా రాష్ట్ర కమిటీపెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతానన్నారు జిల్లా అధ్యక్షులు సదయ్య యాదవ్ కు రాష్ట్ర కమిటీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *