ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి  సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్.

తేది:05-01-2026 భూపాలపల్లిజిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.

భూపాలపల్లిజిల్లా:గణపురం మండల కేంద్రంలో వలసలు నివారించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని  సర్పంచ్ కట్కూరి రాధిక- శ్రీనివాస్. ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణ, పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఫీల్డ్ ఛానల్ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులకు సకాలంలో వచ్చి కొలతల ప్రకారం పనులు చేయాలన్నారు. ఉపాధి హామీ కూలీలు ఐరిష్ విధానంలో  హాజరుకావాలని ప్రతిరోజు రెండు పర్యాయాలు  హాజరు ఉంటుందని, తెలిపారు. ఉపాధి పనిచేసే వారికి ప్రతిరోజు వేతనం 307 రూపాయలు  కూలి పడే విధంగా చూడాలని  ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీదేవి కి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజేందర్. ఈసీ రాజు టెక్నికల్ అసిస్టెంట్. సంపత్ రైతులు. సిరిగినేని బాబురావు , తడక సాంబయ్య , వైనాల వెంకటేశ్వర్లు  యువజన నాయకులు మచ్చిక రక్షిత్. శివ , రావుల సురేష్   పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *